గురువారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2026 అన్నదాతకు అపార నష్టం బాపట్ల: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో తుఫాన్ వరద పరిస్థితి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, చినగంజాం మండలాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని చెప్పారు. మిగిలిన 14 మండలాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయన్నారు. నల్లమడ డ్రెయిన్‌లో సుమారు 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, సముద్రంలోకి నీరు వెళ్లే పరిస్థితులు మెరుగుపడటంతో డ్రెయిన్లలో నీటిమట్టాలు తగ్గుతున్నాయని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారి రాకపోకలకు అంతరాయం కొనసాగుతోందని, వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాల్సిన ఆరు సబ్‌స్టేషన్ల పరిధిలో సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సుమారు 30,416 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 880 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. సుమారు 15 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత వ్యవసాయ, ఉద్యాన పంటలు, రహదారులు తదితర నష్టాలపై సమగ్ర అంచనా చేపడతామని చెప్పారు.
మత్స్యకారులు సురక్షితం చీరాల టౌన్: సముద్రంలో వేటకు వెళ్లి తప్పిపోయిన వాడరేవు తీరప్రాంత గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు క్షేమంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, కావలి తీరంలో ఒడ్డుకు చేరుకున్నారు. వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, అధికారులు కూడా సమాచారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కృష్ణపట్నంలో ఒడ్డుకు చేరుకున్నారన్న సమాచారం తెలియడంతో వివరాలు సేకరించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన వై. రమణ, ఎస్. పోలారావు, టి. అప్పారావు, ఎం. జగన్నాథం, జి. కొందాడ అనే మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు జిల్లా అధికారులకు సమాచారం అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రికి స్వగ్రామమైన వాడరేవుకు వారు చేరుకోనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
న్యూస్‌రీల్
పునరావాస కేంద్రం పరిశీలన
బాపట్ల: మండలంలోని జమ్ములపాలెం గ్రామ చర్చిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ బుధవారం రాత్రి పరిశీలించారు. ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రం వద్ద ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు. వెంట జిల్లా అగ్నిమాపక అధికారి వినయ్, ఇరిగేషన్ శాఖ డీఈ ధనలక్ష్మి, తహసీల్దార్ షేక్ సలీమా, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.
పులిచింతల సమాచారం
బాపట్ల
గురువారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2026
● 30,416 హెక్టార్లలో
దెబ్బతిన్న వ్యవసాయ పంటలు
● 880 హెక్టార్లలో దెబ్బతిన్న
ఉద్యాన పంటలు
● విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు
చర్యలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 28.1923 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కుల లీకేజీ ద్వారా వెళుతోంది.