అదనపు భూ సమీకరణకు భూములిచ్చేది లేదు | - | Sakshi
Sakshi News home page

అదనపు భూ సమీకరణకు భూములిచ్చేది లేదు

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

● రైల్వే లైన్‌, ఐఆర్‌ఆర్‌, ట్రంక్‌ రోడ్లకు మాత్రమే భూములిస్తాం ● తాడికొండ మండలం కంతేరులో సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం

తాడికొండ: రైల్వేలైన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ట్రంక్‌ రోడ్లకు మాత్రమే తాము భూములిస్తామని, వీటికంటే అదనంగా ప్రభుత్వం సమీకరణకు అడిగితే ఒక్క ఎకరం కూడా భూమి ఇవ్వమని కంతేరు గ్రామ రైతులు సీఆర్డీఏ అధికారులకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంతేరు గ్రామంలో నుంచి రైల్వేలైన్‌కు 31 ఎకరాలు, రింగ్‌ రోడ్డు, ట్రంక్‌ రోడ్లకు 94 ఎకరాలు భూమి మాత్రమే వెళుతుందని, దీనికి మాత్రమే తాము భూములిస్తామని తెలిపారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ నెంబర్‌ 166/2026, ఎల్‌పీఎస్‌ 07–10–2026 ప్రకారం మొత్తం తమ గ్రామంలో 974 ఎకరాలు సమీకరించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చిందని కానీ తాము దీనికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం –2014, సెక్షన్‌ 55(4) ద్వారా రైతులందరూ అభ్యంతరాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో సీఆర్డీఏ అధికారుల సమక్షంలో తెలియజేశామన్నారు. జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో కూడా అర్జీ ఇచ్చిన అనంతరం ఆ ప్రతిని ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రెవెన్యూ విభాగం, సీఆర్డీఏ కమిషనర్‌, తహసీల్దార్‌, కంతేరు గ్రామ కార్యదర్శి, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌కు అందజేయడం జరిగిందన్నారు. కాబట్టి అదనపు భూ సమీకరణ చేయవద్దని కోరారు. అవసరాల మేరకు భూములిచ్చిన రైతులకు తమ పక్కన గతంలో సమీకరణ చేసిన నిడమర్రు గ్రామంలో ప్లాట్లు కేటాయించమని కోరారు.

సుస్థిర ఆహార వ్యవస్థలను అవలంబించాలి

గుంటూరు మెడికల్‌: బీఆర్‌ఐసీఎస్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, గుంటూరు ఆధ్వర్యంలో ‘సుస్థిర ఆహార వ్యవస్థలను అవలంభించండి’ అనే అంశంపై గుంటూరు ఇండియన్‌ టుబాకో గుంటూరులో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్‌ ఎం.డి. నజీనా బేగం మాట్లాడుతూ సుస్థిర ఆహార వ్యవస్థలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఆహారాన్ని అవసరమైన మేరకే తీసుకోవాలన్నారు. ఆహారాన్ని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మానవతా ఫౌండేషన్‌ చైర్మన్‌ వీరారెడ్డి, ఐటీసీ టుబాకో బోర్డు మేనేజర్‌ సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement