దాచేపల్లిలో కూటమి కుట్రలపై న్యాయం గెలుపు | - | Sakshi
Sakshi News home page

దాచేపల్లిలో కూటమి కుట్రలపై న్యాయం గెలుపు

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

దాచేపల్లి: న్యాయస్థానం ఆదేశించడంతో దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా కొప్పుల రవికుమార్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సహకారంతో రవికుమార్‌ను చైర్మన్‌ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన పోలీసులు రవికుమార్‌ అక్రమ మద్యం సీసాలు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ అక్రమంగా అరెస్టు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నామినేషన్‌ దాఖలుకు అవకాశం కల్పించింది. దాచేపల్లి సీఐ షేక్‌ ఖాజావలి బందోబస్తు మధ్య రవికుమార్‌తో నామినేషన్‌ వేయించారు. తొలుత గురజాల సబ్‌జైలు నుంచి ప్రత్యేక వాహనంలో పోలీస్‌ ఎస్కార్ట్‌తో రవికుమార్‌ను దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. రవికుమార్‌ను బలపరుస్తూ షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌, మందపాటి వీరారెడ్డి సంతకాలు చేశారు. అంతకుముందు నడికుడిలో జనం భారీగా గుమిగూడారని, వెళ్లడం ఇబ్బందికరమని సుమారు గంటసేపు రవికుమార్‌ను ఆపేశారు. రవికుమార్‌ ఆరోగ్యం బాగాలేకపోవడంతో గుంటూరుకు తరలిస్తున్నారనే పుకార్లను వ్యాప్తి చేశారు. నామినేషన్‌ కేంద్రం వద్ద కూడా అడ్డుకునేందుకు కూటమి నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. వీడియో తీసిన పలువురి సెల్‌ఫోన్లను కూటమి నేతలు లాక్కొని, వాటిలోని వీడియోలను తొలగించారు. కోర్టు ఆదేశాలు దృష్ట్యా కూటమి నేతలను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

కోర్టు ఆదేశాలతో వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి

కొప్పుల రవికుమార్‌ నామినేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement