బాపట్ల: గాంధీ స్ఫూర్తిగా పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బాపట్ల పట్టణంలోని సాయి రామ్ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జరిగింది. 72 అవార్డులను జిల్లా కలెక్టర్ ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి కలెక్టర్, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అవార్డుల ప్రదానం చేశారు. గాంధీ ఆశయాలను కొనసాగించాలని ఆయన సూచించారు. సూర్యలంక బీచ్ ఆరు నెలల్లో సుందరంగా మారిపోయిందన్నారు. పర్యాటకుల సంఖ్య క్రమేపీ పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ సింగ్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. విజయమ్మ, జిల్లా పరిశ్రమల మేనేజర్ వై. రామకృష్ణ, మహిళ సంక్షేమ శాఖ పీడీ ఎస్. సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ సింగయ్య, మెప్మా పీడీ ఆనంద సత్యపాల్, పలు శాఖల అధికారులు, పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.
గాంధీ స్ఫూర్తిగా ముందుకు సాగాలి
Oct 3 2026 1:50 AM | Updated on Oct 3 2026 1:50 AM
● గాంధీ జయంతి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. పీజీఆర్‌ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డీఆర్‌ఓ లవన్న, బాపట్ల ఆర్‌డీఓ హరికుమార్ పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు.
Advertisement


