‘స్వచ్ఛ ఆంధ్ర’లో గుంటూరుకు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ ఆంధ్ర’లో గుంటూరుకు అవార్డులు

Oct 3 2026 1:50 AM | Updated on Oct 3 2026 1:50 AM

నెహ్రూనగర్‌: పరిశుభ్రత, వ్యర్థాల సమగ్ర నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో గుంటూరు నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ 2026’లో పురస్కారాలు వచ్చాయి. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ ఈ పురస్కారాలను అందుకున్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ.. 3 లక్షలకు పైగా జనాభా కేటగిరీలో చేపట్టిన పారిశుద్ధ్య చర్యలకు ‘స్వచ్ఛ మునిసిపాలిటీ’ విభాగంలో గుంటూరు 2వ స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు. వంద శాతం డోర్‌ టూ డోర్‌ చెత్త సేకరణ, ఎంఆర్‌ఎఫ్‌ సెంటర్లు, వర్మి కంపోస్ట్‌ యూనిట్లు, ప్లాస్టిక్‌ నిషేధం అమలు వంటి చర్యలు ఇందుకు దోహదపడ్డాయన్నారు. గాలి నాణ్యత పెంపు, పచ్చదనం పెంపొందించినందుకు ‘వాయు సర్వేక్షణ్‌ – స్వచ్ఛ వాయు అవార్డు’ దక్కిందని వివరించారు. మరోవైపు ప్రజల భాగస్వామ్యంతో చెత్త వర్గీకరణ, ఆన్‌ సైట్‌ కంపోస్టింగ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలను సమర్థంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement