నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

బాపట్ల: యువత తమ విద్యార్హతలకు అనుగుణంగా వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే మెరుగైన ఉపాధి అవకాశాలను పొందగలరని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఈ రాజారావు అన్నారు. దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగ ఉపాధి నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాజారావు మాట్లాడుతూ యువత ఒకటి కంటే ఎక్కువ అంశాలలో నైపుణ్యాన్ని కలిగి ఉండాలని అప్పుడే ఉపాధి రంగంలో మంచి వేతనాలతో స్థిరపడతారని పేర్కొన్నారు. యువతకు మెరుగైన జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గానికి ఒక స్కిల్‌ హబ్‌ను ఏర్పాటు చేసి నైపుణ్య అభివృద్ధి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రథమ్‌, ఐటీసీ, యూనియన్‌ బ్యాంక్‌ ప్రతినిధులు పాల్గొని తమ సంస్థల తరఫున నిరుద్యోగ యువతీ యువకులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ఎంప్లాయ్‌మెంట్‌ యంగ్‌ ప్రొఫెషనల్‌ హారిక సౌగంధి, రెడ్‌క్రాస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీమన్నారాయణ, డీబీఆర్‌సీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ ఎం హేమలత, ఆర్‌ సెట్‌ ప్రతినిధి రమేష్‌, ప్రథం ప్రతినిధి కౌశిక్‌, సాయి, డీబీఆర్‌సీ ఏరియా కోఆర్డినేటర్‌ వి భగవాన్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ సాధించిన బాపట్ల వాసి

బాపట్ల: బాపట్లకు చెందిన చీమలదిన్నె వెంకట నరేంద్రకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆవిష్కరణ, సాహిత్యం, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్‌న్స్‌) రంగాల్లో ప్రతిభను చాటారు. బాపట్లకు చెందిన చీమలదిన్నె వెంకట నరేంద్ర ఆధ్వర్యంలో ఆయన విశిష్ట బృంద సభ్యులు డాక్టర్‌ పావని, పి.మోహన కీర్తి, కోనేరు మురళీకృష్ణ, నాగేశ్వరనాథ్‌ శుక్లాలు చైన్నెలోని ఐఐటీ మద్రాస్‌ రీసెర్చ్‌ పార్క్‌లో ఈ ఎస్‌ ఎన్‌ పబ్లికేషన్‌న్స్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారుల సమక్షంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ను సాధించారు. ‘ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏఐ‘ అనే పుస్తక రచన ద్వారా సాధించిన ఈ అపూర్వ విజయంతో జ్ఞానం, మానవ మేధస్సు, సాంకేతికత, సృజనాత్మకత, సమిష్టి సంకల్పం ఒకే చారిత్రాత్మక వేదికపై కలిశాయి. ఇది కేవలం ఒక పుస్తక రచన కాదు, చరిత్రను లిఖించిన ఘనత. కృత్రిమ మేధస్సు మనిషి ఆలోచించే, నేర్చుకునే, సృష్టంచే, ప్రపంచంతో అనుసంధానమయ్యే విధానాలను మార్చుతున్న ఈ కీలక సమయంలో, ఈ విజయం కృత్రిమ మేధస్సు భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చలో భారతదేశం అందిస్తున్న విశిష్టమైన కృషికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఒక ఆలోచన నుంచి ఒక పుస్తకంగా, ఒక దార్శనికత నుంచి ఒక రికార్డ్స్‌, మానవ సృజనాత్మకత నుంచి ఒక ప్రపంచ స్థాయి ఘనతగా – ‘ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏఐ‘ ఇప్పుడు చరిత్రలో ఒక భాగమైమని పుస్తకంలో పొందుపరిచారు.

విద్యుదాఘాతంతో మహిళ మృత్యువాత

పట్నంబజారు: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శిరీష(35) ఎనిమిది సంవత్సరాల క్రితం గుంటూరు వచ్చి రైలుపేటలోని పీఎస్‌ఆర్‌ మెస్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈనెల 25న రైలుపేటలో మసీదు పక్కన ఉన్న ఎలక్ట్రికల్‌ పోల్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురైంది. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు శిరీషను తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు. వీరికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 86888 31320కు సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement