బాపట్ల
న్యూస్‌రీల్
సాగర్ నీటిమట్టం వివరాలు
భక్తజన నీరాజనం
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026
ప్రజలకు అండగా సేవ సేతు
నాగండ్ల బాధితులకు వైఎస్సార్ సీపీ భరోసా
బాపట్ల: ‘బాపట్ల సేవ సేతు’ ద్వారా జిల్లా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందనున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా కోసం రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ అమలు తీరుపై సంక్షేమ శాఖల అధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో బుధవారం ఆయన స్థానిక కలెక్టరేట్‌లో హైబ్రిడ్ మోడ్‌లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో సమస్యలను ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలందరికీ వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలలోని విద్యార్థుల సమస్యలను గుర్తించి వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేయాలన్నారు. విరాళాలిచ్చే దాతలకు వేదికగా ఈ వెబ్‌సైట్ నిలుస్తుందన్నారు. బాపట్ల జిల్లాకు ప్రత్యేకంగా లోగో రూపొందించాలన్నారు. ప్రజలకు నిరంతరం ఈ వెబ్‌సైట్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాథమికంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, బాలసదన్, బధిరుల పాఠశాల విద్యార్థులకు అవసరాలను గుర్తించి నిక్షిప్తం చేయాలన్నారు. ఆ వసతి గృహం చిరునామా, వసతి గృహ సంక్షేమ అధికారి ఫోన్ నెంబర్ వంటి పూర్తి వివరాలు అందులో పొందుపరచాలన్నారు. పూర్వ విద్యార్థుల ఫోన్ నెంబర్లను సేకరించి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి కే సత్యనారాయణ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, బీసీ సంక్షేమ అధికారి శివలీల, విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, జీఎస్‌డబ్ల్యూఎస్ జిల్లా కో ఆర్డినేటర్ పి.యశ్వంత్, వసతి గృహ సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకులకు కారవాన్‌తో కొత్త అనుభూతి
బాపట్ల: పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా సూర్యలంక నుంచి హైదరాబాద్ వరకు కారవాన్ వసతిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. స్వదేశీ దర్శన్‌లో భాగంగా పర్యాటక రంగం అభివృద్ధిపై అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కల్పించేలా కారవాన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ చెప్పారు. రాష్ట్రంలోనే ప్రథమంగా నాలుగు ప్రాంతాలలో ఇలాంటి వాహనాలను ఏర్పాటు చేయగా, ఒక వాహనం బాపట్ల జిల్లా సూర్యలంక పర్యాటక ప్రాంతానికి కేటాయించడం సంతోషదాయకం అన్నారు. ఏపీటీడీసీ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రెండు రోజుల ప్రయాణానికి 12 సీట్లకు గాను రూ.85 వేలు ఖర్చు అవుతుందని ఆయన వివరించారు. సమావేశంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి అలిఅస్గర్, ఆర్డీవో పి. గ్లోరియా, ప్రాజెక్ట్ మేనేజర్, అనుబంధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
7 నుంచి కొండవీడు ఫెస్ట్
7
గ్రామంలో నియోజకవర్గ ఇన్‌చార్జి
గాదె మధుసూదన్‌రెడ్డి పర్యటన
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 545.90 అడుగులకు చేరింది. ఇది 200.8378 టీఎంసీలకు సమానం.
జగ్గయ్యపేట: స్థానిక రంగుల మండపం నుంచి పెనుగంచిప్రోలుకు పయనమైన గోపయ్య సమేత తిరుపతమ్మ వారు, సహదేవతలు తిరుగు పయనమయ్యారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.0503 టీఎంసీలు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


