కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం
తాడేపల్లి రూరల్ : ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తాడేపల్లి పోలీసులకు మంగళవారం సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్‌ఐ అపర్ణ కృష్ణానది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చని, ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉండవచ్చని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి శరీరంపై నలుపు నిలువు చారలు కలిగిన చొక్కా, సిమెంట్ కలర్ ఫ్యాంటు ఉందని, చేతికి దారాలు ఉన్నాయని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు.
గుంటూరు లీగల్: గంజాయి విక్రయిస్తున్న మహిళలకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన మహిళలపై నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వలుముల రమణ, గాలం గిరిజలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్. సత్యవతి తీర్పు చెప్పారు. రూ.వెయ్యి కట్టని పక్షంలో 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. కేసులో ప్రాసిక్యూషన్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. వై.సీహెచ్.అశోకవాణి వాదనలు వినిపించారు.
లక్ష్మీపురం: గుంటూరు, అమరావతి రోడ్‌లోని జంపని టవర్స్‌లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు కలిసి సార్వత్రిక సమ్మె నోటీసు మంగళవారం అందజేశారు. ఫిబ్రవరి నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక ఒక్కరోజు సమ్మెలో అంగన్‌వాడీ టీచర్లు హెల్పర్లు, మినీ టీచర్లు, పాల్గొంటున్నారని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో శారమ్మ, రమాదేవి, కె.సుబ్బారావమ్మ, జ్యోతి గంగాదేవి తదితరులు ఉన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: వివిధ మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్‌బాషాను డీఈవో కార్యాలయంలో కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈవో కార్యాలయాల్లో ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లు అప్‌డేట్ కాకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. క్లోజర్‌లు, బకాయిలు, మెడికల్ బిల్లులను చేయాల్సి ఉన్నా సిబ్బంది లేక చేయడం లేదని, సంబంధిత బిల్లులను ఉపాధ్యాయులతో చేయించుకోవాలని చెబుతున్నారని అన్నారు. కొల్లిపర, తుళ్లూరు మండలాల్లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. డీఈవోని కలసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.కేదార్‌నాధ్, కాలేషావలి ఉన్నారు.
కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం


