మోతడక చలపతిలో ‘ఉద్ఘోష్ –2026’
ఫిబ్రవరి 20,21తేదీల్లో నిర్వహణ బ్రోచర్‌లు ఆవిష్కరించిన చైర్మన్ వైవీ ఆంజనేయులు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు
తాడికొండ: మోతడక చలపతిలో ఫిబ్రవరి 20–21 తేదీలలో ఉద్ఘోష్– 2026 పేరిట సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం ఈ మేరకు కళాశాలలో ఉద్ఘోష్ – 2026 బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ సంబరంలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా నాగ శ్రీనివాసరావు, డీన్ ఆఫ్ అడ్మిషన్స్, ఆపరేషన్స్ డాక్టర్ కె.కిరణ్ కుమార్, డీన్‌లు డాక్టర్ పి.బాల మురళీకృష్ణ, డీన్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ వీవీ సుబ్బారావు, కన్వీనర్‌లు డాక్టర్ పి.రత్నబాబు, జి.రామచంద్రరావు వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.


