గ్రామ రెవెన్యూ అధికారుల జిల్లా సంఘం ఏకగ్రీవ ఎన్నిక
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా గ్రామ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ మరియు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యిందని సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనందరావు మంగళవారం ఒక ప్రటకనలో తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ఎన్నికల్లో ఎన్నికల అధికారులుగా పల్నాడు జిల్లా వీఆర్వోల సంఘ నాయకులు చారి, రామారావు వ్యవహరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఏపీఆర్‌ఎస్‌ఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్, సెక్రటరీ వెంకట్రావు, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయప్రసాద్ (చంటి), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ హాజరయ్యారన్నారు.
జిల్లా నూతన కార్యవర్గం..
గుంటూరు జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడిగా పిడుగు ఆనందరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా షేక్ అయూబ్, వైస్ ప్రెసిడెంట్లుగా ఎం.కోటేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, పి.మాల్యాద్రి, కె.నాగేశ్వరరావు, కె.గోపి, వి.లీల, జనరల్ సెక్రటరీలుగా టీసీహెచ్ రామారావు, టి.సుధాకర్ రావు, ఎస్.కోకిల రావు, పి.శ్రీనివాసరావు, కె.మల్లేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, నరేష్, బి.శిరీష, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా షేక్ మౌలాలి, కట్టా సత్యానందం, పులి భాస్కరరావు, బుస్సా వెంకటేశ్వరరావు, షేక్ రఫీ, సీహెచ్ ప్రభాకర్, కె.శివజ్యోతి, ట్రెజరర్‌గా వి.రాజశేఖర్, స్పోర్డ్స్’ అండ్ కల్చరల్ సెక్రటరీగా టి.బోసుబాబు, ఈసీ మెంబర్లుగా ఎం.జగదీష్, సీహెచ్ బాబూరావు, పి.వీరయ్య, వి.సెబాస్టిన్, జె.తిరుపతి రాయుడు, జె.సంగీతరావు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కో–ఆర్డినేటర్‌గా బూసిరాజు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం జిల్లా కార్యవర్గం.. జిల్లా అధ్యక్షుడిగా మనోహర రాజన్, సహ అధ్యక్షుడిగా రవిబాబు, ఉపాధ్యక్షుడిగా మరియదాసు, సెక్రటరీగా నాగేశ్వరరావు, ట్రెజర్‌గా షేక్ కరిమున్నిసా, జాయింట్ సెక్రటరీగా యశోద ఎన్నికయ్యారని తెలిపారు.


