వెన్నెముక సమస్యలపై అవగాహన అవసరం
తెనాలిరూరల్: వెన్నెముక సమస్యలపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని ప్రముఖ స్పయినన్ సర్జన్, మల్లికా స్పయిన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ జె.నరేష్‌బాబు చెప్పారు. నడుమునొప్పి, సయాటికా వంటివి రావటానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. స్థానిక బోసురోడ్డులోని ఐఎంఏ హాలులో ఆదివారం రాత్రి జరిగిన వైద్యుల సమావేశంలో డాక్టర్ సీతారామమ్మ వడ్లమూడి జ్ఞాపకార్థం అందజేస్తున్న బంగారు పతకాన్ని ప్రముఖ స్పయిన్ సర్జన్, మల్లికా స్పయిన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ జె.నరేష్‌బాబుకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్‌బాబు వెన్నెముకకు సంబంధించి సమస్యలు–నివారణోపాయాలుపై డాక్టర్ సీతారామమ్మ స్మారక ప్రసంగం చేశారు. ఐఎంఏ సభ్యులకు అవగాహన కల్పిస్తూ ఆయా వ్యాధుల నివారణకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యవిధానాలను వివరించారు. స్వర్గీయ డాక్టర్ సీతారమమ్మ భర్త, ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బాబు ఆర్.వడ్లమూడి విచ్చేశారు. సమావేశంలో ఐఎంఏ, తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కొత్త శ్యామ్‌ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరప్రసాద్, పాలకవర్గ సభ్యులు, సీనియర్ డాక్టర్లు డాక్టర్ టి.రాకేష్, డాక్టర్ తాడిబోయిన అఖిలేష్, సీనియర్ వైద్యులు కొమ్మినేని రమేష్‌బాబు, జి.నరసింహరావు, కె.శ్రీనివాసరావు, వి.విశ్వమోహనరావు, వి.శేషగిరిరావు, జేవీ సుబ్బారావు, చందు సాంబశివుడు, కేఎల్‌వీ ప్రసాద్, డాక్టర్ జె.భానుప్రసాద్, జె.హనుమంతరావు, తాడిబోయిన మస్తానమ్మ, విజయవాణి, సరోజిని, సుధారాణి, గిరిజ, శ్రీదేవి, టి.వినిల్, సీహెచ్ భానుప్రసాద్ పాల్గొన్నారు.


