ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బాపట్ల: బాపట్ల జిల్లా కేంద్రంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్, శకటాలు ఆకట్టుకునే విధంగా సాగాయి. కలెక్టర్ వి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ విశాలమైన విలువలతో కలిగి విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు వివిధ రకాల కళలు కలిగినది మన దేశమని తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కళలను రాబోయే తరాలవారికి అందించాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు ఆనందం కలిగించాయని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు.
ఘనంగా ఎట్‌హోమ్ కార్యక్రమం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బంగ్లాలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
శకటాల ప్రదర్శన
77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పలు శాఖలు శకటాలను ప్రదర్శించాయి. జిల్లా మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఏపీఎంఐపీ సంయుక్తంగా, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా,గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సంయుక్తంగా, గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్ శాఖ సంయుక్తంగా, పారిశుద్ధ్య శాఖ (బాపట్ల, చీరాల, రేపల్లె), నైపుణ్య శిక్షణ శాఖ, లీడ్ బ్యాంక్ సంయుక్తంగా, రిజిస్ట్రేషన్‌న్స్, స్టాంప్స్ శాఖలు అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటుచేసిన స్టాల్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజలు, విద్యార్థులు స్టాల్స్ ను ఆసక్తిగా తిలకించారు. ఆయా శాఖలచే ఏర్పాటు చేయబడిన స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్ తిలకించారు. మొదటి బహుమతి జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ద్వితీయ, తృతీయ బహుమతులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్టాల్, పారిశుద్ధ్య శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు లభించాయి. కార్యక్రమంలో పీఎంఈజీపి పథకం కింద రూ.30 లక్షలు, పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద రూ.20 లక్షలు రుణాల మంజూరు ఉత్తర్వులు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. వారితోపాటు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి.ఉమామహేశ్వరరావు, జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, జిల్లా రెవెన్యూ అధికారి డి.గంగాధర్ గౌడ్ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు


