‘పచ్చ’ మూకల బరితెగింపు
కోడి పందేల డబ్బుతో తాగొచ్చి దారుణం
శనివారం అర్ధరాత్రి కేఎన్ పల్లి సర్పంచ్ నాగేశ్వరరావుపై హత్యాయత్నం ముందస్తు సమాచారంతో తప్పించుకున్న సర్పంచ్, ఇతర కుటుంబ సభ్యులు పది సవర్ల బంగారం, రూ.3 లక్షల నగదు చోరీ టీడీపీ కార్యకర్తలతో కలిసి దాడికి తెగబడిన రౌడీ షీటర్ బాలకోటిరెడ్డి చుండూరు వైఎస్సార్‌సీపీ నాయకుడు రవిశంకర్ రెడ్డిపైనా దాడి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జిల్లాలో వరుస దాడులు గతంలో నగరం మండలంలో వైఎస్సార్‌సీపీ నేత నున్నా భూషయ్య హత్య
టీడీపీ అరాచకాలకు ఇవిగో సాక్ష్యాలు
2024 అక్టోబర్ 5వ తేదీన నగరం మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు నున్నా భూషయ్యను మంత్రి అనగాని అనుచరులు కత్తులు, రాడ్లతో దాడి చేసి నరికి చంపారు. గ్రామంలో ఆధిపత్యం కోసమే టీడీపీ నేతలు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.
చెరుకుపల్లి మండలం కస్తూరిపేటలో 2024 జూన్ 26న జర్నలిస్ట్ యనుమల వెంకటేశ్వరరావు గృహాన్ని పచ్చమూకలు జేసీబీతో కూల్చివేశాయి.
చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెంకు చెందిన దళిత నేత రాజ్‌కుమార్ ఇంటిపై 30 మందితో కూడిన టీడీపీ మూక దాడి చేసింది. ఆయనతోపాటు గర్భిణిగా ఉన్న ఆయన భార్యపైనా దాడి చేసి గాయపరిచారు. కులం పేరుతో దూషించారు. ఊరు వదలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. – ఇదే గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రసాదరెడ్డిని ఊరు విడిచి వెళ్లాలని టీడీపీ మూకలు బెదిరించాయి.
చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావును ఊరు వదలి వెళ్లకపోతే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరించారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. చెన్నుకోటేశ్వరరావు 1995 నుంచి వరుసగా మూడు దఫాలుగా గుళ్లపల్లి సర్పంచ్‌గా, ఆ తర్వాత మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సతీమణి కుడా సర్పంచ్‌గా చేశారు. మండల స్థాయిలో పేరున్న నేత. అయినా ఆయన ఊరువదలి వెళ్లాల్సి వచ్చిందంటే టీడీపీ గూండాల దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.
గుదేటి బాలకోటిరెడ్డి వేటపాలెం వద్ద కోడి పందేలు నిర్వహించారు. కోడి పందేల ద్వారా వచ్చిన డబ్బుతో అతని అనుచరులకు మద్యం పోయించారు. గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావును హత్య చేసేందుకు గుంపుగా వెళ్లారు. ఆయన ఇంటిలో లేక పోవడంతో ఇంటిపై దాడి చేశారు.
– వరికూటి అశోక్‌బాబు, వేమూరు
నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
అధికార మదంతో పచ్చ మూకలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులైన ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నాయి. పచ్చ గూండాలు ఏకంగా హత్యలకు తెగబడుతున్నారు. వారి ఇళ్లు కూలగొడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలోని కొత్త నారికేళపల్లి సర్పంచ్ నాగేశ్వరరావుపై చుండూరుకు చెందిన టీడీపీ రౌడీషీటర్ బాలకోటిరెడ్డి శనివారం అర్ధరాత్రి వందలాది మంది అనుచరులతో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాడి విషయమై ముందే సమాచారమందుకున్న నాగేశ్వరరావు తన కుమారుడు, తమ్ముళ్లతో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.
సాక్షి ప్రతినిధి, బాపట్ల/వేమూరు: వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలోని కొత్త నారికేళపల్లి సర్పంచ్ నాగేశ్వరరావు దాడి విషయమై ముందే సమాచారమందుకోవడంతో తన కుమారుడు, తమ్ముళ్లతో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఏమాత్రం ముందస్తు సమాచారం లేకపోయి ఉంటే నాగేశ్వరరావు టీడీపీ మూకలు చేతిలో ప్రాణాలు కోల్పోయేవారు. సర్పంచ్ దొరకక పోవడంతో ఆగ్రహించిన బాలకోటిరెడ్డి తన అనుచరులతో కలిసి ఆయన ఇంటి తలుపులు పగులగొట్టారు. ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ఇతర విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటిలో ఉన్న రూ. 3 లక్షల నగదు, పది సవర్ల బంగారాన్ని టీడీపీ మూకలు ఎత్తుకెళ్లి పోయారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఫ్లెక్సీ దహనం చేశారంటూ దారుణం
అక్కడి నుంచి వెళ్లిన టీడీపీ మూకలు చుండూరులో వైఎస్సార్‌సీపీ నేత వుయ్యూరి రవిశంకర్ రెడ్డిపైనా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి కేఎన్‌పల్లి శివారులోని టీడీపీ ఫ్లెక్సీ దహనం జరిగింది. వైఎస్సార్‌సీపీ వారే తగులబెట్టారని టీడీపీ వారి ఆరోపణ. టీడీపీ వారే దహనం చేసుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ వారు పేర్కొంటున్నారు. ఇదే సాకుతో శనివారం రాత్రి టీడీపీ నేత, రౌడీ షీటర్ బాలకోటిరెడ్డి ఏకంగా సర్పంచ్ ఇంటిపైనే దాడికి తెగబడ్డాడు. గ్రామంలో ఆధిపత్యం కోసమే టీడీపీ మూకలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి విధ్వంసం సృష్టించాయని, సర్పంచ్ నాగేశ్వరరావును హత్య చేసేందుకు తెగబడ్డారని సర్పంచ్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఆగస్టు నెలలో వినాయక చవితి సందర్భంగా సర్పంచ్‌పై టీడీపీ మూకలు దాడికి తెగబడినట్లు సర్పంచ్ బంధువులు పేర్కొంటున్నారు. నిజంగానే వైఎస్సార్‌సీపీ వారు ఫ్లెక్సీలు తగలబెట్టి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు . కాబట్టి వారు విచారించి వాస్తవాలు తేలుస్తారు. అవన్నీ పక్కనబెట్టి టీడీపీ మూకలు సర్పంచ్‌పై ఏకంగా హత్యాయత్నానికి పాల్పడటం గమనార్హం. రౌడీషీటర్ ఏకంగా సర్పంచ్ ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. పైగా బాధితులను పరామర్శించకుండా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబును రాత్రి నుంచి పోలీసులు గృహనిర్బంధం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ కేసుల పరంపర
హత్యలు, దాడులు, దౌర్జన్యాలే కాదు.. అధికారాన్ని అడ్డుపెట్టి వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబుపై ఇప్పటికే అధికార పార్టీ వారు పలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై పలు కేసులు పెట్టి జైలుకు పంపారు. జిల్లావ్యాప్తంగా పలువురిపై అక్రమ కేసులు పెట్టి రౌడీషీట్లు నమోదు చేయిస్తున్నారు. వుయ్యూరి రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గుంటూరులో కొత్త బైక్ కొనుగోలు చేసి ఇంటికి రాత్రి 11 గంటలకు చుండూరు వచ్చా. చుండూరులోని దేవస్థానంలో పూజ చేసి ఇంటికి చేరుకున్నా. బాలకోటిరెడ్డి అనుచరులు వచ్చి కర్రలతో ఇష్టారాజ్యంగా కొట్టారు.’’ అని వాపోయారు.
చంద్రబాబు పాలన మొదలయ్యాక జిల్లాలో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నాయి.
‘పచ్చ’ మూకల బరితెగింపు
‘పచ్చ’ మూకల బరితెగింపు
‘పచ్చ’ మూకల బరితెగింపు
‘పచ్చ’ మూకల బరితెగింపు
‘పచ్చ’ మూకల బరితెగింపు


