సరస్ మేళా ద్వారా రూ.25 కోట్ల ఆదాయం
గుంటూరు రూరల్: గుంటూరు నగరంలో 13 రోజుల పాటు జరిగిన సరస్ మేళా–2026 అఖిల భారత డ్వాక్రా బజార్ ఆదివారంతో ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ మొత్తం 343 స్టాల్స్ ఈ మేళాలో ఏర్పాటవ్వగా 25 లక్షల మంది ప్రజలు మేళాను సందర్శించారన్నారు. ఈ మేళా ద్వారా మొత్తం రూ.25 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. సరస్ మేళా టెస్ట్ మ్యాచ్ తరహాలో అద్భుతంగా జరగడం శుభపరిణామం కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.
13 రోజుల్లో 25లక్షల మంది
సందర్శించారు
ముగింపు సభలో
కలెక్టర్ తమీమ్ అన్సారియా


