నేటి పీజీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకోవాలి
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజలు అందజేసిన అర్జీలపై ఉదయం తొమ్మిది నుంచి 10 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరిస్తామని, జిల్లా కలెక్టరేట్‌తోపాటుగా ప్రతి రెవెన్యూ డివిజన్, మండల తహసీల్దార్లు కార్యాలయాలలోను తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. అర్జీదారులు అందజేసిన అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్


