
సమస్య వింటున్న కలెక్టర్ శివశంకర్
నరసరావుపేట: జగనన్నకు చెబుదాం (స్పందన)కు వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షత వహించి జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, పులిచింతల ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్ వసంతబాబుతో కలిసి 65 అర్జీలను స్వీకరించారు. అర్జీలు ఇచ్చిన లబ్ధిదారులు సమస్యలు వెంటనే పరిష్కరించి వారికి సమాచారం ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా దాతలు ప్రజల సౌకర్యార్థం భోజనాలను ఏర్పాటు చేశారు. దాతలకు కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలియజేసి ఘనంగా సత్కరించారు.
‘జగనన్నకు చెబుదాం’లో 65 అర్జీలు స్వీకరణ