Weekly Horoscope Telugu: ఈ వారంలో ఈ రాశి వారు సమస్యల నుంచి బయటపడతారు

Weekly Horoscope Telugu 26-03-2023 To 01-04-2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారాలలో అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం.  పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుప్రార్థన చేయండి. అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.  చేపట్టిన పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది.

వృషభం(కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో  మీ కృషికి తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు  ఊహించని విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఊహించని రీతిలో  రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. 

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక  విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రావలసిన బాకీలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో లాభాలు. విద్యార్థులు నైపుణ్యాన్ని చాటుకుంటారు.  ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగాలలో ఎంతటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు.   శ్రీనృసింహ మహామంత్రం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.  వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పాతబాకీలు వసూలవుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగ విధి నిర్వహణ సాఫీగా సాగిపోతుంది. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం కాగలవు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.  వారం  ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరాఘవేంద్ర ధ్యానం చేయండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.  ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. దైవదర్శనాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి.  వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విశేష గుర్తింపు. వారం మధ్యలో  శ్రమ పెరుగుతుంది. అనుకోని ధనవ్యయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు  సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో తమ సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు  మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో బంధువులతో వివాదాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యల నుంచి నేర్పుగా బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. వ్యాపారాలలో అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆప్తుల ద్వారా శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో అనుకోని  లాభాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరమైన సమయం. వారం ప్రారంభంలో  కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. 

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. కళారంగం వారికి  ప్రయత్నాలు సఫలం.  వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబ సమస్యల నుంచి అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఒక  కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులయత్నాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top