ఈ రాశివారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది | Weekly Horoscope Telugu 19 11 23 To 25 11 23 | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది

Published Sun, Nov 19 2023 6:44 AM | Last Updated on Sun, Nov 19 2023 9:10 AM

Weekly Horoscope Telugu 19 11 23 To 25 11 23 - Sakshi

మేషం: కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.

వృషభం: విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు.  రాఘవేంద్రస్తుతి మంచిది.

సింహం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలకు సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురుకావచ్చు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు. విద్యార్థులు శ్రమపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.

కన్య: అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది.  ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు.  గణేశాష్టకం పఠించండి.

తుల: వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు.  పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.  చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: ఉత్సాహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. బంధువులతో తగాదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  మధ్యలో ధనలబ్ధి. వాహనయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు.  లక్ష్మీస్తుతి మంచిది.

మకరం: ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని రుణాలు తీరి ఊరట చెందుతారు.  ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన వ్యవహారాలు సకాలంలో  పూర్తి చేస్తారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది.. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  నిరుద్యోగులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభాల సాటిగా ఉంటాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి. కళారంగం వారికి మరిన్ని అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో  ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి. 

కుంభం: ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. కొన్ని రుణాలు సైతం తీరే సమయం.  సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.  ఆస్తుల వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.  ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు క్రమేపీ సర్దుకుంటాయి. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు.  ఉద్యోగాలు  సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు.  కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మనస్సులోని భావాలను తెలియజేస్తారు. రావలసిన  బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి›స్తోత్రాలు పఠించండి.

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement