Weekly Horoscope: ఈ రాశుల వారు వారం మధ్యలో శుభవార్తలు వింటారు

Weekly Horoscope Telugu 16-10-2022 To 22-10-2022 - Sakshi

Weekly Horoscope..

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త విద్యావకాశాలు దక్కించుకుంటారు. పట్టుదలతో క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. ముఖ్యమైన పనుల్లో  జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు.  వ్యాపారాలు అనూహ్యంగా లాభిస్తాయి. ఉద్యోగులు విధుల్లో సత్తా చాటుతారు. రాజకీయవర్గాలకు సానుకూల సమయం. వారం మధ్యలో దుబారా వ్యయం. ఎరుపు రంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. 

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు.  వారసత్వ ఆస్తుల వ్యవహారంలో బంధువులతో తగాదాలు.  అనుకున్న పనులను కొన్ని వాయిదా వేస్తారు.  మిత్రుల నుండి ఒత్తిడులు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు తథ్యం. వారం మధ్యలో శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధనలబ్ధి. ఎరుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. 

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పట్టుదలే ఆయుధంగా ముందడుగు వేస్తారు. ఆర్థికంగా లోటులేకుండా గడుస్తుంది. స్థిరాస్తి విషయంలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రగతి.  ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామాలు పఠించండి.  

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు.  వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆరెంజ్, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన పనులు స్వశక్తితోనే పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.  ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ఉత్సాహంగా గడుపుతారు.  స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులు వచ్చే అవకాశం. రాజకీయవర్గాలకు అన్ని విధాలా కలసివచ్చే సమయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. 

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కేందుకు కృషి చేస్తారు. ఇంటి నిర్మాణాలకు ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చేజారిన పత్రాలు తిరిగి లభ్యమవుతాయి. వ్యాపారాలలో  పెట్టుబడులకు తగినంతగా లాభాలు ఆర్జిస్తారు. వారం చివరిలో వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం చేకూరుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. అందరిలోనూ విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మిత్రుల నుండి ఒత్తిడులు. ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది. 

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కార్యజయం. విలువైన  వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు శుభవర్తమానాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో సంతోషదాయకమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు యత్నాలు సఫలీకృతమవుతాయి. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. వివాహయత్నాలు సానుకూలం కాగలవు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్య సూచనలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగార్థుల ఆశలు ఫలించే సమయం. ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారాలలో తగినంతగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశాలు. రాజకీయవర్గాలకు  ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణే శ్‌ స్తోత్రాలు పఠించండి. 

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు, ఇతర సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. ఉద్యోగార్ధుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలు కనిపిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆరోగ్యం మందగిస్తుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. 

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.  ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి.  ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగార్థులకు కోరుకున్న ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి.  పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top