ఈ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం | Weekly Horoscope Telugu 12 03 2023 To 18 03 2023 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం

Mar 12 2023 6:51 AM | Updated on Mar 12 2023 6:52 AM

Weekly Horoscope Telugu 12 03 2023 To 18 03 2023 - Sakshi

ఈ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో తమ సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మ«ధ్యలో స్వల్ప అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. పనులలో ఆటంకాలు తొలగి సకాలంలో పూర్తి చేస్తారు.  బంధువర్గంతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూ, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అంచనాల మేరకు లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  వారం చివరిలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం.  యుక్తితో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం తొలగుతుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, కాఫీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆస్తి వివాదాల పరిష్కారం. ఈవారం పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ఆకస్మిక ధనలాభం. శుభకార్యాల రీత్యా ఖర్చులు.  విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఉద్యోగాలలో చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మొదట్లో కొంత చికాకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆ««ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ కృషి ఫలించే సమయం. రాజకీయవేత్తలకు  విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, కాఫీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆస్తి విషయంలో బంధువులతో వివాదాలు. ఎంతగా శ్రమపడ్డా ఆశించిన ఫలితం దక్కదు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ఇంటి నిర్మాణయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థికపరిమైన హామీలు వద్దు.. వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. కళారంగం వారికి అంతగా అనుకూలించదు. వారం మధ్యలో స్వల్ప ధనలాభం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన పనులు చకచకా పూర్తి కాగలవు.  కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో భారం తగ్గే సూచనలు. రాజకీయవేత్తలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. నీలం, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఇంటిలో శుభకార్యాలకు సన్నద్ధమవుతారు. మీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. గృహం లేదా ఖరీదైన భూములు కొనుగోలు చేసే వీలుంది.  ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామివర్గాల వారు శ్రమ ఫలించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యవహారాలలో విజయం సాధిస్తారు.  ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పుల బాధలు తొలగుతాయి. ఒక కోర్టు వ్యవహారం అనుకూలంగా ఉండవచ్చు.  ఒక సమాచారం విద్యార్థులకు సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం  చివరిలో  ధనవ్యయం. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
నూతన ఉద్యోగాలు సాధిస్తారు. పరిస్థితులను చక్కదిద్దుకుని అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థులు, క్రీడాకారుల యత్నాలు సఫలమవుతాయి. ఇంటిలో కొన్ని శుభకార్యాలు నిర్వహించే వీలుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత వేగవంతంగా సాగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణే శ్‌ స్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడగలదు. వ్యతిరేకులను ఓర్పుగా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో మీ ప్రతిభ చూపుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలు సరైన గుర్తింపు పొందుతారు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో కొంత ఇబ్బందికర పరిస్థితి. ఆకుపచ్చ, నలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
రుణబాధలు తీరి ఉపశమనం పొందుతారు. ఖరీదైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. అధిక ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement