Weekly Horoscope: ఈ రాశి వారికి వారంలో ఊహించని ధనలాభం | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశి వారికి వారంలో ఊహించని ధనలాభం

Published Sun, Apr 2 2023 7:04 AM

Weekly Horoscope Telugu 02-04-2023 To 08-04-2023 - Sakshi

మేషం..
మీలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది.  ప్రముఖ వ్యక్తులు పరిచయమై మీకు విశేషంగా సహకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. సహనంతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు తమ అనుభవాలతో విజయాలు సాధిస్తారు.  వ్యాపారస్తులకు లాభాలు మరింత సంతృప్తినిస్తాయి. ఉద్యోగులు ఉన్నతపోస్టులను దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు విజయాలు సొంతం చేసుకుంటారు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. శివాష్టకం పఠించండి. 

వృషభం..
ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంటారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. దూరపు బంధువులు మీపై మరింత ప్రేమను కనబరుస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో చొరవ ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగార్ధులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. వ్యాపారులకు మరింత సానుకూలం. ఉద్యోగస్తులు శ్రమానంతరం ఫలితం దక్కించుకుంటారు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో మానసిక ఆందోళన. శ్రమా«ధిక్యం. ఆంజనేయ దండకం పఠించండి.

మిధునం..
మీ చిరకాల కోరిక నెరవేరే సమయం. ఆపదలో ఉన్నవారికి అభయహస్తం అందిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరులు, స్నేహితులతో వివాదాలు కొంత సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తుల వివాదాల నుంచి బయటపడే అవకాశం. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్‌  అవకాశాలు. పారిశ్రామికవేత్తలకు గౌరవ పురస్కారాలు అందుతాయి.  వారం ప్రారంభంలో ధననష్టం. సోదరులతో విభేదాలు. సూర్యారాధన మంచిది.

కర్కాటకం..
 మీ వ్యవహారశైలిపై కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. గృహయోగం. నిరుద్యోగుల ప్రయత్నాలలో కదలికలు. ఆర్థిక అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు జరుపుతారు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువిరోధాలు. దుర్గాదేవిని పూజించండి.

సింహం..
విలాస జీవనం గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలలో విజయం మీదే. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం పెరుగుదల సంతోషం కలిగిస్తుంది. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో  ఆశలు నెరవేరతాయి. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో  కుటుంబసమస్యలు. మానసిక అశాంతి. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య..
కొన్ని కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో విధులు ఇబ్బందిగా మారవచ్చు. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యం.  వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.  విష్ణుధ్యానం మంచిది.

తుల..
చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు. మీ ఆశయాలు సాధనలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. ఎటువంటి నిర్ణయమైనా తేలిగ్గా తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.   ఆదాయం మరింత పెరిగి ఉత్సాహాన్నిస్తుంది.  ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు సమకూరతాయి. వ్యాపార లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో ఖర్చులు. మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం..
రాబడి అంతగా లేకున్నా అవసరాలకు లోటు ఉండదు. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. బంధువులు మీపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. యోగా, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖులు మరింత సాయం అందిస్తారు. వ్యాపారస్తులకు కొంతమేరకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. సోదరులతో విభేదాలు. హయగ్రీవసోత్రాలు పఠించండి.

ధనుస్సు..
ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. ఆపన్నులను సైతం ఆదుకుంటారు. విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు. వివాహ యత్నాలలో బిజీగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు క్రమేపీ తొలగుతాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి పెడతారు. వ్యాపారాలలో భాగస్వాములతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో పూర్వవైభవం పొందుతారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం..
ఖర్చులు అదుపులో ఉంచుకుని పొదుపు పాటిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తుల వివాదాల నుంచి క్రమేపీ బయటపడతారు. కోర్టు వ్యవహారాలలోనూ కొంత ప్రగతి కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. విలాసవంతమైన జీవనం సాగిస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు అందవచ్చు. ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం చివరిలో మానసిక అశాంతి. సోదరులతో విభేదాలు. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం..
అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వాహనాలు, భూములు సమకూర్చుకునే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబసమస్యలు చాలావరకూ పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కళారంగం వారు  కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. బంధువిరోధాలు.  శివాష్టకం పఠించండి.

మీనం..
ముఖ్యమైన పనులు  కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. బంధువుల ఆదరణ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. రాబడి గణనీయంగా పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాల బాట పడతారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ప్రతి విషయంలోనూ విజయమే. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో వైరం. శ్రమ తప్పదు. అంగారక స్తోత్రాలు పఠించండి.

Advertisement
 
Advertisement