
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శు.షష్ఠి ఉ.11.08 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం పునర్వసు ఉ.9.04 వరకు తదుపరి పుష్యమి, వర్జ్యం సా.5.52 నుండి 7.35 వరకు దుర్ముహూర్తం ఉ.5.34 నుండి 7.17 వరకు అమృతఘడియలు... ఉ.6.27 నుండి 8.12 వరకు.
సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
మేషం...పనుల్లో జాప్యం. ఆర్థికాంశాలలో గందరగోళం. దూరప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
వృషభం...మిత్రులు సహకరిస్తారు. ధన, వస్తులాభాలు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మిథునం....వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనలు బంధువులకు నచ్చవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం...పాతబాకీలు వసూలవుతాయి. ఏ పని చేపట్టినా విజయం. సమావేశాలకు హాజరవుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.
సింహం....కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు వివాదాలతో నడుస్తాయి.
కన్య....దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల....సమస్యల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల ప్రభావం.
వృశ్చికం...కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో జాప్యం. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
ధనుస్సు...నిరుద్యోగుల యత్నాలలో అవాంతరాలు. రుణబాధలు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం....పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నేర్పుగా వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
కుంభం...సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. కార్యజయం. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మీనం....వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.