ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు | Today Telugu Horoscope On May 26th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు

May 26 2025 5:46 AM | Updated on May 26 2025 9:01 AM

Rasi Phalalu: Daily Horoscope On 26-05-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.11.19 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: భరణి ఉ.7.40 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.6.51 నుండి 8.21 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు,అమృతఘడియలు: రా.3.45 నుండి 5.16 వరకు.

సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం :  6.24
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం.. నూతన ఉద్యోగయోగం. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం.. మిత్రులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక చింతన.

మిథునం... కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార , ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

సింహం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. కుటుంబసభ్యులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య.... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఒప్పందాల్లో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. శ్రమకు ఫలితం అంతగా ఉండదు.

తుల.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

వృశ్చికం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు.

ధనుస్సు..... పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. దూరప్రయాణాలు.

మకరం...... రుణఒత్తిడులు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. అనుకోని‡ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

కుంభం... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం... బంధువులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. తీర్థయాత్రలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement