ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. | Rasi Phalalu: Daily Horoscope On 26-04-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

Apr 26 2025 5:28 AM | Updated on Apr 26 2025 8:36 AM

Rasi Phalalu: Daily Horoscope On 26-04-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.నవమి ప.1.03 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శ్రవణం ఉ.8.06 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ప.12.02 నుండి 1.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.36 వరకు, అమృతఘడియలు: రా.9.30 నుండి 11.01 వరకు.

సూర్యోదయం :    5.41
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.3.00 నుండి 3.00 వరకు మాస శివరాత్రి.  

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త చిక్కులు.

వృషభం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం.  విద్యావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు.  వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

సింహం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో  స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

తుల: గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు.

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో అవాంతరాలు.

ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

మకరం: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. పనుల్లో మరింత పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

మీనం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement