ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం | Rasi Phalalu: Daily Horoscope On 19-07-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం

Jul 19 2025 4:21 AM | Updated on Jul 19 2025 8:30 AM

Rasi Phalalu: Daily Horoscope On 19-07-2025 In Telugu

   గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.నవమి ప.1.28 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: భరణి రా.12.17 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ప.10.53 నుండి 12.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.17 వరకు, అమృతఘడియలు: రా.7.45 నుండి 9.14 వరకు సూర్యోదయం :    5.38, సూర్యాస్తమయం    :  6.34, రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కళాకారులకు కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: కొన్ని పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాల పరిష్కారం. ఇంట్లో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.

సింహం: కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల: శుభవార్తా శ్రవణం. ఇంటాబయటా అనుకూలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

వృశ్చికం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఉద్యోగయత్నాలలో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

ధనుస్సు: ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు సామాన్యస్థితి.

మకరం: చేపట్టిన పనులు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. స్వల్ప అనారోగ్యం.

కుంభం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి.

మీనం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement