
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.అష్టమి ప.3.56 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: అశ్వని రా.1.57 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.10.13 నుండి 11.43 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు, అమృత ఘడియలు: రా.7.11 నుండి 8.41 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.38, సూర్యాస్తమయం: 6.34.
మేషం: పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. కళాకారులకు సన్మానాలు.
వృషభం: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. శ్రమాధిక్యం. ఉద్యోగాలలో పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మిథునం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలలో అనుకూలత.ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కర్కాటకం: కాంట్రాక్టులు దక్కుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు
సింహం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆకస్మిక ప్రయాణాలు. లేనిపోని చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య: అనుకోని సంఘటనలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.
తుల: వ్యవహారాలలో విజయం.. శుభవార్తలు. వస్తు, వస్త్రలాభాలు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
వృశ్చికం: నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆకస్మిక ధనలాభం. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో అనుకూలం.
ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
మకరం: కుటుంబంలో చికాకులు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు.
కుంభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మీనం: ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.