ఈ రాశి వారికి భూ, గృహయోగాలు | Rasi Phalalu: Daily Horoscope On 13-07-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి భూ, గృహయోగాలు

Jul 13 2026 3:04 AM | Updated on Jul 13 2026 3:04 AM

Rasi Phalalu: Daily Horoscope On 13-07-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.చతుర్దశి సా.6.32 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: ఆరుద్ర రా.3.49 వరకు , తదుపరి పునర్వసు, వర్జ్యం: ప.1.17 నుండి 2.47 వరకు, దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు,అమృత ఘడియలు: సా.6.30 నుండి 7.50 వరకు.

సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం...  కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం..  ఆదాయం అంతగా కనిపించదు. కొత్తగా రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం....  ప్రముఖ వ్యక్తుల పరిచయం. పాతసంఘటనలు గుర్తుకువస్తాయి. చిన్ననాటిమిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం.....  చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

సింహం....  కార్యజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు పురస్కారాలు.

కన్య...  కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గౌరవం. కీలక నిర్ణయాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనంగా సాగుతాయి.

తుల......  మిత్రులతో  తగాదాలు. దూరప్రయాణాలు. పనుల్లో  ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. మానసిక అశాంతి.

వృశ్చికం...  పనుల్లో  అవరో«ధాలు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆరోగ్యభంగం. బంధువులు మిత్రులతో తగాదాలు. విద్యార్థులకు నిరుత్సాహమే. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు....  నూతన ఉద్యోగలాభం. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

మకరం......  పరపతి పెరుగుతుంది. అనుకున్న పనుల్లో  విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు,మిత్రులతో  ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం.....  ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో అకారణ వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం......  రాబడి తగ్గుతుంది. బంధువర్గంతో వైరం. ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు.  వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement