ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 10-07-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి

Jul 10 2026 3:02 AM | Updated on Jul 10 2026 3:02 AM

Rasi Phalalu: Daily Horoscope On 10-07-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.ఏకాదశి రా.1.55 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: భరణి ఉ.10.29 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.9.36 నుండి 11.05 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.11 నుండి 9.03 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.22 వరకు, అమృత ఘడియలు: ఉ.5.51 నుండి 7.24 వరకు, స్మార్త ఏకాదశి.

సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం.....  దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం... ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం.... దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం...  శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా  పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు.

సింహం.... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది.

కన్య...  కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

తుల.....  కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు.శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. వాహనయోగం.

వృశ్చికం...  ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

ధనుస్సు... రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.

మకరం...  బంధువులతో వివాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దైవదర్శనాలు.

కుంభం...  ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. పనులలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

మీనం....  పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement