గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం; తిథి: బ.అష్టమి రా.9.51 వరకు, తదుపరి నవమి; నక్షత్రం: పూర్వాభాద్ర తె.4.57 వరకు(తెల్లవారితే మంగళవారం), తదుపరి ఉత్తరాభాద్ర; వర్జ్యం: ప.11.10 నుండి 12.47 వరకు; దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.16 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.52 వరకు; అమృత ఘడియలు: రా.8.51 నుండి 10.28 వరకు; మృగశిర కార్తె ప్రారంభం
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం.... ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
వృషభం.... గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం.... మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కర్కాటకం.... శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
సింహం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
కన్య.... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
తుల.... కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం.... శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. మిత్రులు, సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
ధనుస్సు.. ఇంటర్వ్యూలు అందుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మకరం.... చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కుంభం... నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల స్థితి.
మీనం.... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. మానసిక ఆందోళన. సోదరులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.


