ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 08-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

May 8 2026 4:03 AM | Updated on May 8 2026 4:03 AM

Rasi Phalalu: Daily Horoscope On 08-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.షష్ఠి ఉ.8.20 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.36 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.9.52 నుండి 11.34 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.58 వరకు, తదుపరి ప.12.21 నుండి 1.12 వరకు, అమృత ఘడియలు: ఉ.10.41 నుండి 12.23 వరకు.

సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం...  ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు. ముఖ్యమైన పనులు  విజయవంతంగా సాగుతాయి. విలువైన సమాచారం. అదనపు ఆదాయం. వ్యాపార లావాదేవీలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.  

వృషభం...  బంధువులతో విరోధాలు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు. ధనవ్యయం. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలలో సమస్యలు.

మిథునం...  దూరప్రయాణాలు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. ఆప్తులతో వివాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపార విస్తరణయత్నాలలో ఆటంకాలు.  ఉద్యోగాలలో బదిలీలు.

కర్కాటకం...  కొత్త పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో అనుకూలత.

సింహం....  నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో ఉంటాయి. సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారాలలో  నూతన పెట్టుబడులు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

కన్య...  ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. బంధువర్గంతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల....  కుటుంబసభ్యులతో వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కొంత శ్రమ పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో  బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం.....   కొన్ని పనులు పురోగతిలో సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం. వస్తులాభాలు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

ధనుస్సు....  ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. రాబడి  తగ్గి నిరుత్సాహం చెందుతారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.

మకరం...  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.  వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.

కుంభం....  పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మీనం...  కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

Advertisement
 
Advertisement
Advertisement