ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 04-06-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Jun 4 2026 4:02 AM | Updated on Jun 4 2026 4:02 AM

Rasi Phalalu: Daily Horoscope On 04-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.చవితి రా.8.14 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.03 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.7.38 నుండి 9.23 వరకు, తదుపరి తె.5.20 నుండి 7.02 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.51 వరకు, అమృత ఘడియలు: సా.6.05 నుండి 7.48 వరకు.

సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.27
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం... కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు.

వృషభం.... పనుల్లో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం..... పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో పూర్వవైభవం.

సింహం.... శ్రమకు ఫలితం కనిపిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

కన్య....... వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

తుల... మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ధనుస్సు... రుణాలు చేయాల్సివస్తుంది.  ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

మకరం.. నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులు, సోదరుల నుంచి కీలక సమాచారం. భూవివాదాల పరిష్కారం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కుంభం.. మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం... పరిచయాలు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనయోగం. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

Advertisement
 
Advertisement
Advertisement