
ఈ రాశి వారికి వ్యవహారాలలో విజయం అందుతుంది. ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలాభం..
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, తిథి: శు.పంచమి ఉ.7.54 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తర సా.4.55 వరకు, తదుపరి హస, వర్జ్యం: రా.1.59 నుండి 3.40 వరకు, దుర్ముహూర్తం: సా.4.48 నుండి 5.42 వరకు, అమృతఘడియలు: ఉ.9.04 నుండి 10.43 వరకు.
సూర్యోదయం : 5.39
సూర్యాస్తమయం : 6.33
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: దూరప్రాంతాల నుండి శుభవర్తమానాలు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటి కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
వృషభం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మిథునం: ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో వివాదాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కర్కాటకం: వ్యవహారాలలో విజయం. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సమాజసేవలో భాగస్వాములవుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
సింహం: పనుల్లో జాప్యం. మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
తుల: కొత్త రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
వృశ్చికం: పనులలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలు.
ధనుస్సు: పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. ఉద్యోగులకు విధుల్లో ఊరట.
మకరం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
కుంభం: ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.