దినఫలం: ఈ రాశివారికి ధన, వస్తులాభాలు, మిగతా 11 రాశులవారికి ఇలా..

Horoscope Today 23 05 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం,
సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.23

తిథి: శు.చవితి రా.11.30 వరకు, తదుపరి పంచమి,
నక్షత్రం: ఆరుద్ర ఉ.11.42 వరకు, తదుపరి పునర్వసు,
వర్జ్యం: రా.12.47 నుండి 2.33 వర కు,
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.55 వరకు, తదుపరి రా.10.50 నుండి 12.21 వరకు,
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు 

అమృతఘడియలు: లేవు.

మేషం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. 

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. 

మిథునం: ఉద్యోగ, వివాహయత్నాలు మందగిస్తాయి. ధనవ్యయం. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. 

కర్కాటకం: బంధువర్గంతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలోచనలు కలసిరావు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. .

సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. దైవదర్శనాలు. 

కన్య: నూతన ఉద్యోగయోగం. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. విందువినోదాలు. 

తుల: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. 

వృశ్చికం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. 

ధనుస్సు: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధన, వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. 

మకరం: వ్యవహార విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది వ్యాపార వృద్ధి. 

కుంభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. గృహ, వాహనయోగాలు. చర్చల్లో పురోగతి. వృత్తి, వ్యాపారాలు అనుకూలత. సన్మానాలు. వాహనయోగం. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top