Today Astrology: ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు, నూతనోత్సాహం

Horoscope Today 09 06 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.షష్ఠి రా.8.21 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: దనిష్ఠ రా.9.19 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: తె.4.01 నుండి 5.31 వరకు(తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.56 వరకు, తిరిగి ఉ.11.46  నుండి 1.06 వరకు, అమృతఘడియలు: ప.12.55 నుండి 1.46 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.29. 

మేషం: చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

వృషభం: వ్యవహారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం.  శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో  నిరుత్సాహం.

మిథునం: పనులలో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. బంధుమిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కర్కాటకం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

తుల: శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

వృశ్చికం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. బాకీలు వసూలవుతాయి. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: వ్యవహారాలలో గందర గోళం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.

కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. భూవివాదాలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు.

మీనం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top