ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, చేపట్టిన పనుల్లో విజయం | Daily Horoscope In Telugu February 25 2024 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, చేపట్టిన పనుల్లో విజయం

Feb 25 2024 7:01 AM | Updated on Feb 25 2024 7:01 AM

Daily Horoscope In Telugu February 25 2024 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.పాడ్యమి రా.7.15  వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పుబ్బ రా.12.20 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.6.35 నుండి 8.24 వరకు, దుర్ముహూర్తం: సా.4.27 నుండి 5.13 వరకు, అమృతఘడియలు: సా.5.5.13 నుండి 7.01 వరకు.

సూర్యోదయం        :  6.26
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్ధికంగా ఇబ్బందులు. బంధువులతో వివాదాలు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ధనవ్యయం.  ఆరోగ్యభంగం.  వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. 

వృషభం: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అనారోగ్యం. సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన.  వ్యాపారాలు నత్తనడకన సాగతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు.

మిథునం: కొత్త పరిచయాలు.  శుభవార్తా శ్రవణం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. పనుల్లో  పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు.

కర్కాటకం: బంధువులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు∙నిరాశ కలిగించవచ్చు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు..

సింహం: ఆసక్తికరమైన సమాచారం. భూసంబంధిత వివాదాలు పరిష్కారం. చాకచక్యంగా పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధు, మిత్రులతో విరోధాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు.

తుల: ప్రముఖులతో చర్చలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ముఖ్య నిర్ణయాలు. పనులలో విజయం. గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. దైవదర్శనాలు.

వృశ్చికం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం..

ధనుస్సు: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలించవు. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు. 

మకరం: పనుల్లో  అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆస్తి వివాదాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు.  వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

కుంభం: నూతనోత్సాహంతో పనులు  పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాల ప్రారంభం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

మీనం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి.  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement