Daily Horoscope: ఈ రాశివారు కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తారు | Daily Horoscope In Telugu - 6th August 2024 Rasi Phalalu | Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశివారు కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తారు

Aug 6 2024 6:48 AM | Updated on Aug 6 2024 8:32 AM

Daily Horoscope In Telugu - 6th August 2024 Rasi Phalalu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.విదియ సా.6.08 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: మఖ సా.5.17 వరకు , తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.2.02 నుండి 3.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.07 వరకు, తదుపరి రా.10.57 నుండి 11.41 వరకు, అమృతఘడియలు: ప.2.43 నుండి 4.22 వరకు, మంగళ గౌరీ వ్రతం; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.43, సూర్యాస్తమయం: 6.28. 

మేషం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: మిత్రుల చేయూత. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. ఊహించని నిర్ణయాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన అవకాశాలు.

కర్కాటకం: శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. బంధువులతో విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

సింహం: చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.

కన్య: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

తుల: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

ధనుస్సు: పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ధనలబ్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మీనం: కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తారు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement