ఈ రాశివారికి బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

Daily Horoscope In Telugu (30-1-2021) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి బ.విదియ రా.11.24 వరకు తదుపరి తదియ, నక్షత్రం మఖ తె.4.01 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి పుబ్బ, వర్జ్యం సా.4.10 నుంచి 5.44 వరకు, దుర్ముహూర్తం ఉ.6.37 నుంచి 8.06 వరకు అమృతఘడియలు... రా.1.37 నుంచి 3.12 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.50
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

రాశి ఫలాలు:

మేషం: ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అదనపు బాధ్యతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మిథునం: పనుల్లో విజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

సింహం: శుభవార్తా శ్రవణం. వాహనసౌఖ్యం. ఉద్యోగయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కన్య: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. సోదరులు, మిత్రులతో విభేదాలు. నిర్ణయాలలో మార్పులు. దైవచింతన. వ్యాపారాలు అంతంతగానే ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

తుల: కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: శ్రమాధిక్యం. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బం«ధువులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: శ్రమానంతరం పనులు పూర్తి. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

కుంభం: ఉద్యోగయత్నాలలో అనుకూలత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top