శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం తిథి బ.పంచమి సా.5.07 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం శతభిషం తె.5.07 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం ప.12.06 నుండి 1.43 వరకు, దుర్ముహూర్తం ఉ.8.09 నుండి 9.01 వరకు, అమృతఘడియలు... రా.9.46 నుంచి 11.24 వరకు తదుపరి రా.10.56 నుండి 11.40 వరకు.
సూర్యోదయం : 5.31
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు:
మేషం: పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృషభం: పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో పురోగతి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
మిథునం: విచిత్రమైన సంఘటనలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సోదరుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల: బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
వృశ్చికం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ధన్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూలత. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.
మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కుంభం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహకారం అందుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు.
మీనం: చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.


