గ్రహం అనుగ్రహం (07-09-2020) | Daily Horoscope In Telugu (07-09-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (07-09-2020)

Sep 7 2020 6:11 AM | Updated on Sep 7 2020 7:38 AM

Daily Horoscope In Telugu (07-09-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. భాద్రపద మాసం. తిథి బ.పంచమి సా.6.10 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం భరణి పూర్తి (24 గంటలు).  వర్జ్యం ప.2.20 నుంచి 4.06 వరకు. దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.10 వరకు, తదుపరి ప.2.51 నుంచి 3.38 వరకు. అమృత ఘడియలు రా.12.56 నుంచి 2.34 వరకు.

సూర్యోదయం: 5.49 
సూర్యాస్తమయం: 6.07
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. 
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

మేషం : నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది. వాహనయోగం.

వృషభం : ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులతో అకారణ వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.

మిథునం : పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త ఉద్యోగయోగం.

కర్కాటకం : కొత్త పనులు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహం. 

సింహం : కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. ముఖ్యమైన పనులలో అవరోధాలు. ఆరోగ్యం.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ.

కన్య : కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి.. బంధువులతో తగదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. దూరప్రయాణాలు.

తుల : వ్యవహార విజయం. అరుదైన ఆహ్వానాలు.కాంట్రాక్టులు పొందుతారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు..

వృశ్చికం : మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తిలాభం. బ«ంధువుల నుంచి ఆహ్వానాలు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలపరిస్థితి. నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు.

ధనుస్సు : ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి విమర్శలు. కాంట్రాక్టులు చేజారతాయి. పనులలో అవాంతరాలు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు. కళాకారులకు సమస్యలు ఎదురుకావచ్చు.

మకరం : కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం. నిరుద్యోగుల యత్నాలు మందుకు సాగవు.

కుంభం : కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాల పరిష్కారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు.

మీనం : కుటుంబసభ్యులతో వైరం. పనుల్లో  ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని ప్రయాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement