గ్రహం అనుగ్రహం (01-09-2020)

Daily Horoscope In Telugu (01-09-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుభాద్రపద మాసం. తిథి శు.చతుర్దశి ఉ.8.46 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం ధనిష్ఠ సా.4.58 వరకు, తదుపరి శతభిషం. వర్జ్యం రా.12.32 నుంచి 2.14 వరకు. దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు, తదుపరి రా.10.50 నుంచి 11.36 వరకు. అమృత ఘడియలు ఉ.6.04 నుంచి 7.56 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం : ప్రముఖులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ముందడుగు వేస్తారు.

వృషభం : ఆప్తుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న పనులు చక్కదిద్దడంలో ఆటంకాలు తొలగుతాయి. మీ సత్తా అందరూ గుర్తిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కళాకారులకు నూతనోత్సాహం.

మిథునం : సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత
అనుకూలత. 

కర్కాటకం : దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు
సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం : వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. నూతన ఉద్యోగాలు పొందుతారు. దైవదర్శనాలు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కన్య : పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుఉత్సాహాన్నిస్తాయి. వాహనయోగం.

తుల : చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. స్థిరాస్తి వివాదాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకులు. 

వృశ్చికం : దూరప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు.

ధనుస్సు : పరిచయాలు పెరుగుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు. బాకీలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం : ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. పనులు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కుంభం : చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆశయాలు నెరవేరతాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో సఖ్యత. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూల మార్పులు.

మీనం : పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top