పచ్చమూక కుతంత్రం | - | Sakshi
Sakshi News home page

పచ్చమూక కుతంత్రం

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

దొంగ

ఓట్లకు

బి.కొత్తకోట: బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్ల ద్వారా గెలిచేందుకు టీడీపీ కుతంత్రాలు పన్నింది. గురువారం జరిగిన ఓటింగ్‌ సందర్భంగా వివిధ మార్గాల్లో గుర్తు తెలియని వ్యక్తులు, బురఖాలు ధరించిన మహిళలను ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి రప్పించి వారి ద్వారా తమకు అనుకూలంగా ఓట్లు వేసుకునేందుకు వ్యూహం పన్నారు.

● బి. కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని 28 పోలింగ్‌ బూత్‌ లను ఏడు కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. వైఎస్‌ఆర్‌సీపీ చైర్మన్‌, వార్డు అభ్యర్థులు పోలింగ్‌ కార్యక్రమంలో ఉన్నారు. అయితే దొంగ ఓట్లు వేసుకోవడం కోసం టీడీపీ రాయచోటి, ఇతర ప్రాంతాల నుంచి యువకులను, మహిళలను ఆటోలు, కార్లలో ఇక్కడికి రప్పించారు. వారంతా వివిధ పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల దృష్టికి రావడంతో అప్రమత్తమయ్యారు. రంగసముద్రం రోడ్డు వైపు నుంచి ఆటోల్లో వస్తున్న మహిళలను గుర్తించి వైఎస్‌ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి ఖలీల్‌ వారిని ప్రశ్నించారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినట్లు గుర్తించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే ఓ ఇంటిలో దాగి ఉన్న దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని పార్టీ నాయకులు వెళ్లి నిలదీశారు. దీంతో వారు బస్సు ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించారు.

సోదాలతో పోలీసుల హడావుడి ..

చైర్మన్‌ అభ్యర్థి ఖలీల్‌ అతిథి గృహంలో పోలీసులు సోదాల పేరుతో హడావుడి చేశారు. అతిథి గృహంలో స్థానికులు గాని, బయట వ్యక్తులు కానీ ఎవరూ లేరు. అయినప్పటికీ పోలీసులు వీడియో చిత్రీకరణ చేస్తూ అడుగడుగునా తనిఖీ చేశారు. ఆవరణలోనూ వదలకుండా గాలింపులు చేశారు. అనంతరం వెనుదిరిగి వెళ్లారు.

రాయచోటి, ఇతరా ప్రాంతాల

నుంచి తరలింపు

బురఖాల్లో వచ్చిన మహిళలు

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

వైఎస్‌ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి అతిథి

గృహంలో పోలీసుల హడావుడి

బి.కొత్తకోటలో పోలైన ఓట్లు 16,256

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement