రౌతుకుంట సర్పంచ్‌ అభ్యర్థి అదృశ్యం! | - | Sakshi
Sakshi News home page

రౌతుకుంట సర్పంచ్‌ అభ్యర్థి అదృశ్యం!

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

● తెల్లవారుజామున తీసుకెళ్లిన పోలీసులు

● నిరసనగా గ్రామస్తుల ఎన్నికల బహిష్కరణ

టాస్క్‌ఫోర్స్‌: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లె మండలం రౌతుకుంటలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు, సర్పంచ్‌ అభ్యర్థి వంగిమల్ల వేణుగోపాల్‌ రెడ్డిని తెల్లవారుజామున ఇంటి నుంచి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, ఇంతవరకు ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇంటి వద్ద మహిళలను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతల ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. వేణుగోపాల్‌ రెడ్డి అదృశ్యానికి నిరసనగా రౌతుకుంట గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement