చౌడేపల్లె: అనుమానాస్పదస్థితిలో ఆరునెలల గర్భిణీ మంజుల(29) మృతిచెందిన ఘటన చౌడేపల్లె మండలం ఆమనిగుంట పంచాయతీ నూనెముద్దనపల్లెలో శుక్రవారం జరిగింది. సోమల మండలం వడ్డిపల్లెకు చెందిన రాజమ్మ, రామచంద్రయ్యల కుమార్తె బి.మంజులకు నూనెముద్దనపల్లెకు చెందిన సుబ్రమణ్యంతో ఆరేళ్ల క్రితం వివాహమైంది.సుబ్రమణ్యం మూగ వాడు కావడంతో అన్నదమ్ముళ్లతో కలిసి ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు సౌజన్య,శ్రీలత ఉండగా మరోసారి మంజుల గర్భం దాల్చింది. అప్పటినుంచి ఇంట్లో మళ్లి బిడ్డ వద్దని, అభార్షన్ చేయించాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు.ఈక్రమంలో మంజులకు అభార్షన్ చేసేందుకు ఇంజెక్షన్ ఇచ్చారని, త్రీవ్రమైన నొప్పులతో ఉన్న ఆమెను గ్రామానికి సమీపంలోని నల్లగుట్ట వద్ద పొలం వద్ద పెట్టారు. శుక్రవారం మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గ్రామంలోకి తేవడంతో మృతురాలి బంధువులు ఇంటి వద్ద కు చేరుకొని భర్త సుబ్రమణ్యంను ప్రశ్నించగా మూగసైగలతో జరిగిన విషయాన్ని తెలిపాడు.శరీరంపై గాయాలు ఉడడంతో, మంజులను అత్తింటి వారే కొట్టి చంపేశారని మృతిరాలి బంధువులు ఆరోపించారు. కాగా మృతదేహం వద్ద మృతురాలి భర్తతోపాటు అత్త లక్ష్మమ్మ తపప మిగిలిన కుటుంబ సభ్యులెవరు లేకపోవడంతో పలుఅనుమానాలకు దారితీస్తోంది. ఏమీ తెలియని ఆ ఇద్దరు చిన్నారులు తండ్రి పక్కన కూర్చుని బిత్తరచూపులు చూడడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.ఘటనా స్థలాన్ని ఎస్ఐ చిన్నరెడ్డెప్ప చేరుకొని విచారణ చేపట్టారు.
మృతిచెందిన మంజుల, తండ్రి వద్ద ఉన్న
ఇద్దరు కుమార్తెలు


