మంచి ముహూర్తం చూడండి స్వామీ ! | - | Sakshi
Sakshi News home page

మంచి ముహూర్తం చూడండి స్వామీ !

Oct 17 2026 3:15 AM | Updated on Oct 17 2026 3:15 AM

మదనపల్లె సిటీ: సెంటిమెంట్‌ అనేది రాజకీయ నాయకులకు, సినిమా యాక్టర్లకు కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేయాలన్న సరే మంచి ముహుర్తం లేకుండా అడుగేయరు. ప్రస్తుతం స్థానిక మున్సిపల్‌ ఎన్నికల వేడి రాజుకోవడంతో మళ్లీ జ్యోతిష్యుల చుట్టూ అభ్యర్థులు ప్రదక్షిణ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ కీలకం. శుభముహుర్తాల వేట అప్పుడే మొదలైంది. ఉన్నది తక్కువ సమయమైనా ప్రచారమైనా.. నామినేషన్లయినా ఏ సమయంలో ప్రారంభించాలి..ముహుర్తం మంచిదా కాదా అని బేరీజు వేసుకుంటున్నారు. దీంతో జ్యోతిష్యులు,పురోహితలకు డిమాండ్‌ పెరిగిపోయింది . తొలిరోజు ముహుర్తం అంటే 16న షష్టి, శుక్రవారం మూలా నక్షత్రం కావడంతో బలమైందని జ్యోతిష్యులంటున్నారు. ఈనెల 18న ఆదివారం ఉత్తారాషాడ నక్షత్రం కూడా మరింత బలం చేకూరేలా చేస్తుంది. రాజ్యాధికారం దక్కే రవి శుభకరుడు కావడం కలిసోచ్చే అంశమని పురోహితులు చెబుతున్నారు. మధ్యలో 17 నిజంగానే మధ్యస్థంగానే ఉంటుందన్నారు. రాజకీయ నాయకులు నామినేషన్లు కోసం మంచి ముహుర్తాలను ఖరారు పచేసుకోవడానికి వస్తున్నారు. గడువు దగ్గరపడటంతో నామనక్షత్రాల ఆధారంగా ముహుర్తాలు పెట్టించుకుంటున్నారని మదనపల్లెకు చెందిన ప్రముఖ వేదపండితులు శివకుమార్‌శర్మ తెలిపారు.

జ్యోతిష్యులు, పురోహితుల వద్దకు అభ్యర్థుల క్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement