ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

Oct 17 2026 3:15 AM | Updated on Oct 17 2026 3:15 AM

మార్కాపురం టౌన్‌: మార్కాపురం జిల్లా పరిషత్‌ (బాలురు) ఉన్నత పాఠశాలలో 52వ రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలబాలికల కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఎం.చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఈఓ సామా సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోటీలను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.వి.ప్రభావతి, సెక్రటరీ వై.శ్రీకాంత్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యన్‌.అర్జునరావు, ట్రెజరర్‌ యం.సుబ్బరాజు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోని 28 జిల్లాల జూనియర్‌ బాల బాలికల జట్లు పాల్గొన్నాయి. ఆదివారం సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.దామోదర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వై సీనయ్య, శంకర్‌, చెంచయ్య నాయుడు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, జాహ్నవి ప్రియ, కె.ఓబులేసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement