రొంపిచెర్లలో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

రొంపిచెర్లలో భారీ వర్షం

Oct 17 2026 3:15 AM | Updated on Oct 17 2026 3:15 AM

● రహదారులపై నిలిచిన నీరు

● చెరువును తలపిస్తున్న బీసీ హాస్టల్‌

చెరువును తలపిస్తున్న బీసీ హాస్టల్‌ వినాయక నగర్‌ రహదారిపై నిలిచిన వర్షపు నీరు

రొంపిచెర్ల: అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రొంపిచెర్ల మండలంలో భారీ వర్షం ముంచెత్తింది. ఒక్కసారిగా కురిసిన వానకు స్థానిక బీసీ హాస్టల్‌, తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. వినాయకనగర్‌లో మురుగు కాలువలు పూడిపోవడంతో డ్రైనేజీ నీరు రోడ్లపైనే ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది.మరోవైపు ఈ వర్షం రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగితే గింజలు మొలకెత్తుతాయని, వాన ఇలాగే కొనసాగితే టమోటా తోటలు పూర్తిగా కుళ్ళిపోతాయని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి, తమను ఆదుకోవాలని రొంపిచెర్ల మండల రైతులు, ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement