●2011 పంచాయతీ పత్రం.. అప్పట్లోనే అడ్డగోలుగా ఆమోదం | - | Sakshi
Sakshi News home page

●2011 పంచాయతీ పత్రం.. అప్పట్లోనే అడ్డగోలుగా ఆమోదం

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

●2011 పంచాయతీ పత్రం.. అప్పట్లోనే అడ్డగోలుగా ఆమోదం

మదనపల్లె టౌన్‌: A¯]l²-Ð]l$Ķæ$Å hÌêÏ MóS…{§ýlOÐðl$¯]l Ð]l$§ýl-¯]l-ç³ÌñæÏ Ð]l$…yýlÌS… _¯]l²-†ç³µ-çÜ-Ð]l¬{§ýl… (ïÜsîæ-G…) ÌZ §ólÐ]l#yìl Ð]l*¯éÅÌSMýS$ Æý‡„ýS׿ MýSÆý‡$-OÐðl…-¨. CMýSPyìl } ¯]lÌS-ÒÆý‡ VýS…V>-¿ýæÐé° AÐ]l$Ã-ÐéÇ, } ÒÆ>…f-¯ól-Ķæ$-ÝëÓÑ$ §ólÐ]l-Ý릯éÌSMýS$ ^ðl…¨¯]l ₹15 MørÏMýS$ Oò³V> ÑË$-OÐðl¯]l ¿¶æ*Ð]l¬-ÌS¯]l$ Mö…§ýlÆý‡$ MýS*rÑ$ Æ>f-MîSĶæ$ ¯éĶæ$-MýS$Ë$, BÌSĶæ$ MýSÑ$-sîæMìS ^ðl…¨¯]l Ð]lÅMýS$¢Ë$ MýS$Ð]l$ÃOMðSP MýS¯ól²Ô>-Æý‡…r* {V>Ð]l$çÜ$¢Ë$ Ð]l$…yìl-ç³-yýl$™èl$-¯é²Æý‡$. ™égêV> BÌSĶæ$ {´ë…VýS-׿…ÌZ° ç³^èla° ^ðlrϯ]l$ Ķæ$£ól-^èleV> ¯]lÇ-MìS-Ðól-Ķæ$yýl…, §ólÐé-§éĶæ$ Ô>Q ¿¶æ*Ñ$° B{MýSÑ$…_ Æ>{†MìS Æ>{™ól Æý‡çßæ§éÇ HÆ>µr$ ^ólĶæ$-yýl…™ø D ÑÐé§ýl… ¡{Ð]l Æý‡*ç³… §éÍ-a…-¨.

సర్వే నంబర్ల సాక్షిగా దోపిడీకి స్కెచ్‌

గ్రామస్తులు బయటపెట్టిన అధికారిక భూ పత్రాలను పరిశీలిస్తే అక్రమార్కుల కబ్జా పర్వం స్పష్టంగా అర్థమవుతోంది. సర్వే నంబర్‌ 995/ఏ1 కు సంబంధించిన 0.49 ఎకరాల భూమి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానానికి చెందినదిగా రికార్డుల్లో పక్కాగా నమోదై ఉంది. అదేవిధంగా 995/బి2 లో 1.03 ఎకరాలు, 995/బి3 లో 2.91 ఎకరాలు చొప్పున ఆలయ భూముల వివరాలు దేవాదాయ శాఖ పత్రాల్లో స్పష్టంగా ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఈ సర్వే నంబర్లలోని భూములను తమ సొంత స్థలాలకు కలుపుకునేందుకు పచ్చ నేతలు స్కెచ్‌ వేశారు. అందుకోసమే దేవుడి స్థలంలో రోడ్డు వేస్తూ, అడ్డుగా ఉన్న చెట్లను నరికేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

8 రూ.30 కోట్ల భూమి కబ్జా.. అధికారుల మౌనం ఎందుకు ?

స్థానికుల అంచనా ప్రకారం ఈ ప్రాంతంలోని దేవాదాయ భూముల విలువ సుమారు రూ.15కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇంత విలువైన దేవస్థాన భూములపై ఆక్రమణ ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి మాన్యం అంటే ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, అది భక్తులు, ప్రజల విశ్వాసానికి సంబంధించిన ఆస్తి అని వారు స్పష్టం చేస్తున్నారు. ఒకసారి భూమిలో రోడ్డు వేసి హద్దులు మార్చుకుంటే భవిష్యత్తులో ఆ భూమిని తిరిగి దేవస్థానం ఆధీనంలోకి తీసుకురావడం మరింత క్లిష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ముందున్న ప్రశ్నలు.. స్పందించిన ఏసీ

995/ఏ1 భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది, 2011 నాటి పంచాయతీ అనుమతి ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక బృందాన్ని పంపి హద్దులు నిర్ణయించి, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ను వివరణ కోరగా సమస్య ఇంతవరకు తన దృష్టికి రాలేదన్నారు. వెంటనే స్థలాన్ని పరిశీలించి, ఏమి కబ్జా జరిగింది.. ఎంత భూమిని ఎవరు కబ్జా చేశారు? అనే దానిపై అరా తీసి తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని చెప్పారు.

ఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా 2011 ఫిబ్రవరి 5వ తేదీకి సంబంధించిన గ్రామ పంచాయతీ తీర్మాన పత్రం ముందుకు వచ్చింది. అందులో సర్వే నంబర్‌ 995/ఏ1కు సంబంధించిన భూమిపై నారాయణ పేరుతో పంచాయతీలో ఆమోదం/అనుమతి అప్పటి టీడీపీ సర్పంచి ప్రభాకర్‌ రెడ్డికి సంబంధించిన వివరాలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సీటీఎం ఏళ్లపాటు టీడీపీకి కంచుకోటగా నిలిచింది. ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తమ్ముడు ఏళ్ల తరబడి సర్పంచ్‌లుగా కొనసాగారు. వారి హయాంలోని మోసాలు జరిగాయి. అయితే దేవాదాయ శాఖకు చెందిన భూమిపై గ్రామ పంచాయతీకి ఎంతవరకు అధికారం ఉంది? ఆ భూమి దేవస్థానం పేరుతో ఉన్న సమయంలో వ్యక్తిగత వినియోగానికి అనుకూలంగా ఏదైనా అనుమతి ఇవ్వబడిందా? ఇచ్చి ఉంటే ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయనీ, ఇక్కడే అసలు వివాదం మొదలవుతోందని గ్రామస్తులు అంటున్నారు. రికార్డుల్లో దేవస్థానానికి చెందిన భూమిగా నమోదై ఉన్న స్థలంపై ఇతరుల హక్కులు ఎలా ఏర్పడ్డాయి? పంచాయతీ అనుమతి ఉంటే దానికి దేవాదాయ శాఖ అనుమతి ఉందా? భూమి హద్దులు మార్చారా? లేక రహదారి పేరుతో దేవస్థాన భూమిని క్రమంగా సొంత స్థలాల్లో కలుపుకునే ప్రయత్నం జరుగుతోందా? అన్న విషయాలపై అధికారులు విచారణ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

సీటీఎంలో దేవుడి మాన్యం ‘కబ్జా’!

రూ. 30కోట్లకు పైగా విలువైన

భూములపై టీడీపీ నేతల కన్ను?

పత్రాల్లో ఆలయ భూముల వివరాలు.. పంచాయతీ అనుమతులపై

అనేక అనుమానాలు

ఆలయ కమిటీ, స్థానికుల మధ్య విభేదాలు : సమగ్ర విచారణకు గ్రామస్తుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement