● వైఎస్సార్ సీపీ రైతు విభాగం డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట నిరసన
మదనపల్లి (కురబలకోట): రాయలసీమతో పాటు అ న్నమయ్య జిల్లా కరువు కాటకాలతో విలవిలలాడు తోందని వెంటనే జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ మదనపల్లి నియోజక వర్గ రైతు విభాగం అధ్యక్షులు జన్నె రాజేంద్ర నాయుడు ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ముందుగా వారు కలెక్టరేట్ ముందు ధర్నా, నిరసన వ్యక్తం చేశారు. గతంలో అనంతపురం జిల్లా అంతటా ఎకరానికి రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు పంట నష్టం కింద ఆర్థిక సాయం అందించారన్నారు. ఆ తరహాలో ఇక్కడ కూడా సాయం అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టమాట, వేరుశనగ పంట నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఎన్. విజయభాస్కర్ రెడ్డి, వలసపల్లి నాగరాజరెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
రాష్ట్రంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ పట్టణ రజక సంఘం నాయకులు ఎం. నాగరాజు ఆధ్వర్యంలో రమేష్‌బాబు, వెంకటలక్ష్మమ్మ, గురుమూర్తి, రెడ్డెప్ప, అన్నయ్య కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు హామీ ఇచ్చారని మేనిఫెస్టోలో కూడా చేర్చారన్నారు. దేశంలో 18 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్టీ జాబితాలో ఉన్నారని రాష్ట్రంలో కూడా వీరిని ఎస్సీ జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
● తంబళ్లపల్లి మండలం ఎద్దులవేమన్నగారిపల్లి పరిధిలో దళితుల ఇళ్లకు కేటాయించిన భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ధర్నా చేశారు.


