మదనపల్లి టౌన్: పీలేరులోని ఎస్కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని పలువురు నేతలు, పలు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. నిర్లక్ష్యం తేలితే చట్టపర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రకటన
మదనపల్లె సిటీ: జిల్లా విద్యాశాఖ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు ఎంపికై న పాఠశాలల వివరాలను డీఈఓ సుబ్రమణ్యం, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ నాగరాజు వెల్లడించారు. సోమవారం వారు మాట్లాడుతూ జిల్లాలో మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల 236 పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుందన్నారు. రెండవ స్థానం మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల 114 పాయింట్లు, కలకడ మండలం కోన జెడ్పీ ఉన్నత పాఠశాల మూడవ స్థానంలో 104 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని పేర్కొన్నారు. నాల్గవ స్థానం కేజీబీవీ రామాపురం 90 పాయింట్లు, చౌడేపల్లె మండలం జెడ్పీ ఉన్నత పాఠశాల పుదిపట్ల ఐదవ స్థానంలో 52 పాయింట్లు దక్కించుకున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులను ఈ నెల 5వతేదీన కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తామని వివరించారు.
సీఎం సూపర్ ఆడిట్
పిటీషన్లకు సత్వర పరిష్కారం
– జేసీ శివ్ నారాయణ శర్మ
మదనపల్లి: సీఎం కార్యాలయ సూపర్ ఆడిట్ టీమ్ ద్వారా జిల్లాకు పంపిన పిటిషన్లను సత్వరం పరిష్కార మార్గాలు చూపుతున్నట్లు జేసీ శివ్ నారాయణ శర్మ తెలిపారు. సోమ వారం మదనపల్లి కలెక్టరేట్ కోర్టు హాల్‌లో సంబంధిత అధికారులు, అర్జీదారులతో కలసి 13 పిటీషన్లపై ఆయన స్వయంగా విచారించి పరిష్కార మార్గాలను చూపారు. ప్రతి పిటిషన్‌లో అధికారుల స్థాయిలో లోపాలు, పొరపాట్లు జరిగాయా అనే అంశాలను పరిశీలించి లోపాలుంటే వెంటనే సరిదిద్ది అర్జీదారులకు న్యాయం చేయాలన్నారు. తీసుకున్న నిర్ణయం సరైనదైతే సంబంధిత చట్టాలు, నిబంధనలను అర్జీదారులకు స్పష్టంగా తెలియజెప్పి సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ బాట
మదనపల్లి (కురబలకోట): ఏపీ జేసీసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల హక్కులు, పెండింగ్ బకాయిల సాధన కోసం ఉద్యమ కార్యాచరణకు ఉద్యుక్తులయ్యారు. మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ వేదికగా జేఏసీ అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రధాన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభు త్వ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అన్నమ య్య జిల్లా చైర్మన్ పి.నరసంహ కుమార్ మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 26 వరకు రెండు దశల్లో ఉద్యమం చేస్తామని.. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే మూడో దశ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తామ ని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి గోపి, ఏపీ ఆర్‌ఎస్‌ఏ మహిళా విభాగం జిల్లా చేర్‌పర్సన్ భార్గవి, ఏపీఆర్‌ఎస్‌ఏ సెక్రటరీ ఆర్‌ఎం బాజ్జి, మదనపల్లి ఏపీఆర్‌ఎస్ ఎ ప్రెసిడెంట్ సాగర్, అస్లం, వంశీ, గిరి,రాణి, బయ్యారెడ్డి, సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోషియేషన్ కూడా వీరికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు నాయకులు ముని గోపాల కృష్ణ తెలిపారు.
దళితమిత్ర
సంఘ కార్యవర్గ ఎన్నిక
కడప సెవెన్‌రోడ్స్ : దళితమిత్ర సంఘ అన్నమయ్య, తిరుపతి జిల్లాల కార్యవర్గ ఎన్నిక సోమవారం కడప నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు కై పు రామాంజనేయులు అధ్యక్షతన రెండు జిల్లాల సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జిగా కరకోటి కిశోర్‌బాబు, తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జిగా పూజారి ప్రశాంత్‌ను ఎన్నుకున్నారు. మునీంద్ర, చాట్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


