● రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు తీరని అన్యాయం: ఆకేపాటి | - | Sakshi
Sakshi News home page

● రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు తీరని అన్యాయం: ఆకేపాటి

Feb 22 2026 7:26 AM | Updated on Feb 22 2026 7:26 AM

● రాయ

● రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు తీరని అన్యాయం: ఆకేపాట

● రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు తీరని అన్యాయం: ఆకేపాటి

రాయచోటి: రాయలసీమకు సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టును నిలిపేసి తాను పుట్టిన ప్రాంతానికి సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నమయ్య జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సీమ ప్రయోజనాలను గాలికొదిలేసి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో దాదాపు పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ పనుల్ని చంద్రబాబు నిలిపేయడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు తన తప్పు తెలుసుకుని సీమ లిఫ్ట్‌ పనులు ప్రారంభించకపోతే మార్చి 1న పార్టీలకతీతంగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని వారు హెచ్చరించారు.

తెలంగాణ నేతలతో చంద్రబాబు కుమ్మక్కు: రమేష్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర అఽధికార ప్రతినిధి

రాష్ట్రంలో అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలు రాయలసీమలో ఉన్నాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు లేకపోతే రాయలసీమకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపునకు సాద్యమైందన్నారు. దీనివల్ల హంద్రీనీవా, గాలేరు–నగిరి, తెలుగు గంగకు నీళ్లు తెచ్చుకునే అవకాశం లభించిందన్నారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్స్‌ నుంచి తీసుకోవాలంటే తెలంగాణ 800 అడుగుల కింద నుంచి లిఫ్ట్‌ చేసి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు తీసుకెళ్లిపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ రాయలసీమ లిఫ్ట్‌ను డిజైన్‌ చేశారన్నారు. చంద్రబాబుకు ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై శ్రద్ధా లేదు, సక్సెస్‌ చేయలేకపోయాడని విమర్శించారు. తెలంగాణ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

రాయలసీమకు చంద్రబాబు ద్రోహం ఇలా: సురేష్‌బాబు, కడప మాజీ మేయర్‌

గతంలో తానే దేవెగౌడ, గుజ్రాల్‌, వాజ్‌పేయిలను ప్రధానుల్ని చేశానని చెప్పుకున్న చంద్రబాబు 1995లో వెలుగోడు, బ్రహ్మసాగర్‌ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ఒక్క రూపాయి నిధులివ్వలేదన్నారు. 1996, 1998లో ఉప ఎన్నికలు జరిగితే మళ్లీ టెంకాయలు కొట్టాడు కానీ రూపాయి కేటాయించలేదని పేర్కొన్నారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు.. ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు ఇవ్వాలన్న ఆలోచన చేసిన పాపానపోలేదని విమర్శించారు.

జగన్‌ మొదలుపెడితే ఆపేసిన చంద్రబాబు: నిస్సార్‌అహమ్మద్‌, మదనపల్లి సమన్వయకర్త

సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాంత వ్యక్తయినా ఇక్కడి ప్రజలకు శాపమేనని తేలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని కేంద్రానికి చెప్పిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్‌ విషయంలో ఇక్కడి ప్రజల మేలును మరిచి పొరుగు రాష్ట్ర నేతల మాటలు విని రాయలసీమకు తీరని నష్టం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం కింద నుంచి నీళ్లు తోడేస్తుంటే.. పైన ఉన్న రాయలసీమ ప్రాంతం నష్టపోతోంది. సీమ ఎత్తిపోతల పథకంపై పార్టీలు, కుల, మతాలకతీతంగా వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టే ఈ ఉద్యమానికి ఇక్కడి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు.

చంద్రబాబు కుయుక్తుల్ని అడ్డుకుంటాం: పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్యే

చంద్రబాబు ఎన్ని ప్రాజెక్టులు ఆపేశాడో ఆయనకు తెలుసు. రాయలసీమ ప్రజలందరికీ తెలుసు. ఈ మధ్య ఓ ఇల్లు కట్టుకోవడం తప్ప కుప్పానికి కూడా చంద్రబాబు చేసిందేమీ లేదని తూర్పారబట్టారు. రాయలసీమకు బాబు అంతా అన్యాయమే చేశాడు. వెలుగొండ ప్రాజెక్టులో ఆయన సగం వదిలేసిన పనుల్ని రాజశేఖర్‌రెడ్డి వచ్చాక పూర్తి చేసి నీళ్లు ఇచ్చారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్‌ విషయంలోనూ చంద్రబాబు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ధ్వజ మెత్తారు చంద్రబాబు ప్రయత్నాల్ని కచ్చితంగా వైఎస్‌ఆర్‌సీపీ తరపున అడ్డుకుంటామన్నారు.

మార్చి 1న కార్యాచరణ ప్రకటిస్తాం

రాయలసీమ నీటి బాధలు పట్టని చంద్రబాబు

జగన్‌ చేపట్టిన సీమ లిఫ్ట్‌ను గాలికొదిలేశారు

పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రం తాకట్టు

మీడియా సమావేశంలో ధ్వజమెత్తినవైఎస్సార్‌ సీపీ నాయకులు

వైఎస్‌ఆర్‌ రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలని ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచాలని చూస్తే సొంత పార్టీ కాంగ్రెస్‌లోనే చాలా మంది వ్యతిరేకించారు. ఆయినా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఎవర్నీ లెక్కచేయకుండా వైఎస్సార్‌ ముందుకెళ్లారన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రాజెక్టుల విషయంలో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. తిరిగి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు అంతా సిద్దం చేసిన తరుణంలో ప్రభుత్వం మారాక మూలనపారేశారన్నారు. చంద్రబాబు రాయలసీమ వాసిగా ఈ ప్రాజెక్టు పూర్తి చే ్తారని ఇక్కడి ప్రజలు భావించారన్నారు. చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో రాయలసీమ లిఫ్ట్‌ ఆపానని రేవంత్‌రెడ్డి చెప్పుకున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు.

● రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు తీరని అన్యాయం: ఆకేపాట1
1/1

● రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు తీరని అన్యాయం: ఆకేపాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement